ఆ రికార్డుకు 26 పరుగుల దూరంలో రోహిత్..

ఆ రికార్డుకు 26 పరుగుల దూరంలో రోహిత్..

టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్, సిక్సర్ల హీరో యువరాజ్ సింగ్‌ రికార్డును బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు హిట్ మ్యాన్, టీమిండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌ శర్మ.. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా యువీ ఏడో స్థానంలో ఉండగా.. ఈ రికార్డును చేరుకోవాలంటే రోహిత్ మరో 26 పరుగులు చేస్తే సరిపోతోంది. అయితే, యువరాజ్ సింగ్ 304 వన్డేల్లో 8701 పరుగులు చేస్తే.. రోహిత్ మాత్రం కేవలం 217 మ్యాచుల్లో 8676 పరుగులు సాధించాడు. మరోవైపు ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న రోహిత్.. వెస్టిండీస్‌ టూర్‌లో మాత్రం అంతగా రాణించలేకపోతున్నాడు. ఇక, ఇవాళ భారత్-విండీస్ మధ్య మూడో వన్డే జరగనుండగా.. యువీ స్కోర్‌ను హిట్‌మ్యాన్ బీట్‌ చేయొచ్చంటున్నారు ఫ్యాన్స్. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ఉన్న టీమిండియా.. ఈ వన్డేలో గెలిచి వన్డే సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేయాలని భావిస్తోంది.