కిందపడిపోయిన హిట్‌మ్యాన్.. గవాస్కర్ ఫైర్..

కిందపడిపోయిన హిట్‌మ్యాన్.. గవాస్కర్ ఫైర్..

పుణె స్టేడియం భద్రతా సిబ్బందిపై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతున్న రెండో టెస్టులో ఓ అభిమాని మైదానంలోకి వచ్చి రోహిత్‌శర్మ పాదాలను తాకడానికి ప్రయత్నించాడు. దీంతో హిట్‌మ్యాన్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. కామెంటరీ బాక్సులో ఉన్న గావస్కర్‌ దీనిపై స్పందించాడు. అభిమానుల అత్యుత్సాహ చర్యల వల్ల ఆటగాళ్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ సిబ్బందిపై మండిపడ్డాడు. అభిమానులను మైదానంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత సిబ్బందిదే అని అన్నారు. ఇలాంటి ఘటనలు భద్రతా సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లనే జరుగుతున్నాయని విమర్శించారు. మైదానంలోకి వస్తున్న అభిమానులను నిలువరించకుండా వారు మ్యాచ్‌ను చూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు గవాస్కర్‌.