హిట్‌మ్యాన్ సూపర్ హిట్.. భారత్ గ్రాండ్ విక్టరీ..

హిట్‌మ్యాన్ సూపర్ హిట్.. భారత్ గ్రాండ్ విక్టరీ..

ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా.. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన రెండో టీ-20లో గ్రాండ్ విక్టరీ కొట్టి బంగ్లాదేశ్‌పై ప్రతీకారం తీర్చుకుంది... భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్లు, ఫోర్లు బాదుతూ బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.. దీంతో 15.4 ఓవర్లలో విజయాన్ని అందుకుంది రోహిత్ సేన.. మొదటి బ్యాటింగ్ చేసి బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులు చేసి.. భారత్ ముందు 154 పరుగుల టార్గెట్‌ను పెట్టగా.. ఓపెనర్ శిఖర్ ధావన్ 31, అయ్యర్ 23 (నాటౌట్‌)కు తోడు.. కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.. తన కెరీర్‌లో 100 టీ20 మ్యాచ్ ఆడుతోన్న రోహిత్.. సెంచరీ బాదడం ఖాయమనే ఊపు కనబడింది.. అయితే లక్ష్యం చిన్నది కావడంతో.. అది సాధ్యపడలేదు. కేవలం 43 బంతుల్లో 85 పరుగులు చేసిన రోహిత్.. తన ఇన్సింగ్స్‌లో 6 సిక్సులు, 6 ఫోర్లు బాదాడు. ఇక, మూడు టీ-20ల సిరీస్ 1-1తో సమం చేసింది టీమిండియా.