రోహిత్‌ శర్మ ని కిందపడేసిన వ్యక్తి !

రోహిత్‌ శర్మ ని కిందపడేసిన వ్యక్తి !

తమ అభిమాన ఆటగాళ్లను దగ్గర నుండి చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు కొంతమంది ఫ్యాన్స్‌ మైదానంలోకి పరిగెత్తుకు వెళ్తున్న ఘటనలు తరచుగా చూస్తేనే ఉన్నాం. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోని, కెప్టెన్‌ కోహ్లిని అయితే అలా ఇబ్బంది పెట్టిన ఘటనలు కోకొల్లలు. తాజాగా రోహిత్‌ శర్మకు కూడా మరోసారి ఇలాంటి అనుభవమే ఎదురైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మెరుగ్గా రాణించి మ్యాచ్‌ను ఒంటి చేత్తో నడిపించేలా ఆడుతున్నాడు.

నిన్న  601/5 వద్ద కోహ్లి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో ప్రొటీస్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో ఫీల్డింగ్‌ చేస్తున్న రోహిత్‌ శర్మ వద్దకు ఓ అభిమాని పరిగెత్తుకు వచ్చాడు. రోహిత్‌ పాదాలను ముద్దాడేందుకు ప్రయత్నించడమే గాకుండా అతడి కాళ్లు పట్టుకుని లాగి కిందపడేశాడు. దీంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది వెంటనే పరిగెత్తుకొచ్చి అతడిని దూరంగా తీసుకవెళ్లారు.

ఆ సమయంలో రోహిత్‌తో పాటు అతడికి సమీపంలోనే ఉన్న రహానే రోహిత్ శర్మ అవస్థలు చూసి ముసిముసిగా నవ్వాడు. సదరు అభిమానిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించాడు. ఆ సమయంలో మ్యాచ్ కామెంటేటర్‌గా ఉన్న సునీల్ గవాస్కర్.. సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉంది మ్యాచ్‌ని ఉచితంగా చూడడానికా ? సెక్యూరిటీ కోసమా అంటూ సీరియస్ అయ్యాడు. మొన్న ఆదివారం విశాఖపట్నం వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఇలానే అభిమాని మైదానంలోకి వచ్చి మ్యాచ్‌ కి అంతరాయం కలిగించారు.