హిట్‌మ్యాన్ సూపర్‌పాస్ట్ హాఫ్ సెంచరీ.. సరికొత్త రికార్డు..

హిట్‌మ్యాన్ సూపర్‌పాస్ట్ హాఫ్ సెంచరీ.. సరికొత్త రికార్డు..

విశాఖ వేదికగా సౌతాఫ్రికాలో జరగుతోన్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనరగ్‌గా తొలిసారి బరిలోకిది సెంచరీతో కదం తొక్కిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. రెండో ఇన్నింగ్స్‌లో సూపర్‌పాస్ట్‌గా హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.. వన్డే మ్యాచ్ తరహాలో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డ రోహిత్.. కేవలం 72 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేసుకున్నారు.. ఇక, టెస్టుల్లో రోహిత్‌కు  ఇది 11వ హాఫ్‌సెంచరీ. మరోవైపు సొంతగడ్డపై అరుదైన రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ.. గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో 82, 51*, 102*, 65, 50*, 176, 50* ఇలా ఏడుసార్లు 50కిపైగా స్కోరు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీమిండియా తరఫున మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఆరుసార్లు ఈ ఫీట్ సాధించగా.. టెస్టుల్లో ఓపెనర్‌గా అరంగేట్రం చేసి అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో 176 రన్స్‌ చేసిన రోహిత్‌.. రెండో ఇన్నింగ్స్‌ 50 పరుగులు చేయడంతో మొత్తం స్కోరు 226 దాటేయడంతో ఆ రికార్డు సాధ్యమైంది. ఇక అంతే కాదు.. ఒకే టెస్ట్‌లో 9 సిక్కులు బాధిన రికార్డు కూడా నెలకొల్పాడు రోహిత్.. దీంతో మాజీ క్రికెటర్ సిద్ధు రికార్డు బ్రేక్ చేశాడు.