హిట్‌మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డు..!

హిట్‌మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డు..!

హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది.. ఏ ఫార్మాట్ అయినా తనకు ఎదురేలేదని తరహాలో తన బ్యాట్‌కు చెబుతున్న రోహిత్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో రోహిత్‌శర్మ 677 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు. దీంతో.. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్ మూడింటిలోనూ టాప్-10లో చోటు దక్కించుకున్న ఏకైక భారత బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో 863 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న రోహిత్, టెస్టుల్లో 722 పాయింట్లతో పదో స్థానంలో  ఉన్నాడు. తాజాగా, టీ20లో ఏడో స్థానంలో నిలిచాడు రోహిత్ శర్మ.