నా కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు...

నా కెప్టెన్సీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు...

ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌ ఐదోసారి విజేతగా నిలవడంపై ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉందని, పేరున్న కొందరు ఆటగాళ్లు ఉండటం వల్లే విజయాలు దక్కలేదని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ప్రతీ చిన్న లోపాన్ని గుర్తించి సన్నాహాలు మొదలు పెట్టామని అతను పేర్కొన్నాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకడామీలో ఉన్న రోహిత్ మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్సీ వ్యవహరంపై జరుగుతున్న రచ్చపై కూడా స్పందించిన హిట్ మ్యాన్.. తానెందుకు మరో జట్టును నడిపించాలని, నా కెప్టెన్సీ నిరూపించుకోవాల్సిన అవసం ఏముందని విమర్శకులపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే 2011లో నాతో సహా అందరూ వేలంలో అందుబాటులో ఉన్నారు కదా. కానీ ముంబై మమ్మల్ని ఎంచుకుంది. మాపై నమ్మకముంచి జట్టును తీర్చి దిద్దుకుంది. ఇష్టమున్నట్లు ఆటగాళ్లను మార్చేయలేదు. బౌల్ట్‌ గత ఏడాది ఢిల్లీకి, అంతకుముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కూడా ఆడాడు కదా. ఆరంభంలోనే బంతిని స్వింగ్‌ చేసి వికెట్లు తీయగల బౌలర్‌ మాకు అవసరం ఉందని భావించాం. అందుకే ఢిల్లీతో గట్టిగా పట్టుబట్టి బౌల్ట్‌ను తీసుకున్నాం. ఆపై అతను సత్తా చాటాడు. నా మనసుకు సరైంది అనిపించేది చేయడమే నా విజయ రహస్యం' అని రోహిత్‌ విశ్లేషించాడు.