ఇంతకంటే గొప్పగా ఇంకేమీ ఉండదు.. రోహిత్‌ శర్మ ట్వీట్..

ఇంతకంటే గొప్పగా ఇంకేమీ ఉండదు.. రోహిత్‌ శర్మ ట్వీట్..

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూకుడు కొనసాగతోంది... బరిలోకి దిగాడంటే ఎలాంటి రికార్డులైనా బద్దలు కావాల్సిందే... సరికొత్త రికార్డులు నెలకొల్పాల్సిందే అనే రేంజ్‌లో ముందుకు వెళ్తున్నాడు... అప్పుడప్పుడు నిరాశపర్చినా తనదైన శైలి ఇన్నింగ్స్‌లతో అభిమానులు ఎప్పుడూ ఉర్రూతలూగించే రోహిత్... తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది... ఇక అసలు విషయానికి వస్తే తన భార్య రితిక సజ్దేకు లవ్లీ మెసేజ్ పెట్టాడు రోహిత్ శర్మ... వాళ్లు ఇద్దరూ ఒక్కటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా... సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చారు హిట్ మ్యాన్... ‘నీవు లేని జీవితాన్ని ఊహించుకోలేను... ఇంతకంటే గొప్పగా ఇంకేమీ ఉండదు... ఐ లవ్ యూ’ అని క్యాప్షన్ తగిలించి లవ్ ఎమోజీలులతో తన భార్య రితిక సజ్దే నుదుటిపై ముద్దుపెడుతున్న ఫొటోను ట్వీట్ చేశారు.. దీంతో ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువా వస్తున్నాయి.