ఆర్సీబీ కోసమే మేము ప్రణాళిక వేస్తున్నం : రోహిత్ శర్మ

ఆర్సీబీ కోసమే మేము ప్రణాళిక వేస్తున్నం : రోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను గెలవలేకపోవడం దురదృష్టకరమని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు, అయితే ఈ ఏడాది విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జట్టుకు మంచి బ్యాలెన్స్ లభించిందని తెలిపారు. ఆస్ట్రేలియా స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో రోహిత్ శర్మ మాట్లాడుతూ, పోటీలో ఉన్న మొత్తం 8 జట్ల బలాన్ని పరిగణనలోకి తీసుకొని ఐపీఎల్ 2020 కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అయితే తమ లైవ్ సెషన్‌లో అభిమానుల ఆర్సీబీ మద్దతు పై స్పందించిన డేవిడ్ వార్నర్, గత పదేళ్లలో కంటే ఐపీఎల్ 2020 లో ఆర్సీబీకి  ఉత్తమ జట్టు లభించిందని అన్నారు. అయితే ఐపీఎల్ 2020 లో ఆర్సీబీ టైటిల్‌ను గెలుచుకోగలదా అని తనకు తెలియదని రోహిత్ శర్మ అన్నారు. అయితే ఐపీఎల్ లీగ్‌లోని మరే ఇతర జట్టు కంటే ముక్యంగా విరాట్ నేతృత్వంలోని జట్టు కోసం ముంబై ఇండియన్స్ ప్రణాళిక వేస్తున్నట్లు నొక్కి చెప్పారు. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా తదుపరి నోటీసు వచ్చే వరకు ఐపీఎల్ 2020  వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే.