అరుదైన రికార్డుపై రోహిత్-ధావన్ కన్ను..!

అరుదైన రికార్డుపై రోహిత్-ధావన్ కన్ను..!

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆసీస్ జట్టుతో తొలి వన్డేకు సిద్ధమైంది టీమిండియా.. మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది... లంకతో పొట్టి సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమయ్యాడు. రోహిత్‌, ధావన్‌ ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగితే రాహుల్‌ను పక్కన పెడతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. మరోవైపు టీమిండియా ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శిఖర్ ధావన్‌ అరుదైన రికార్డుపై కన్నేశారు. ఆస్ట్రేలియాపై వీరిద్దరు కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పితే అరుదైన ఘనత సాధిస్తారు. వన్డేల్లో ఒకే జట్టుపై అత్యధిక శతక భాగస్వామ్యాలు సాధించిన జోడీగా రికార్డు సృష్టిస్తారు. ఈ జాబితాలో ప్రస్తుతం వెస్టిండీస్ ఆటగాళ్లు గ్రీనిడ్జ్‌-హేన్స్‌ జంటతో  కలిసి రోహిత్‌-ధావన్‌ సమంగా నిలిచారు. మూడో స్థానంలో ధోనీ-యువరాజ్‌ సింగ్ ఉన్నారు.