క్రికెట్ తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంలో ఆటగాళ్లు.. 

క్రికెట్ తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంలో ఆటగాళ్లు.. 

కరోనా వైరస్ విరామం తరువాత, అంతర్జాతీయ క్రికెట్ సౌతాంప్టన్‌లో తిరిగి ప్రారంభమైంది. ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ ప్రస్తుతం మొదటి మ్యాచ్ ఆడుతున్నాయి. జో రూట్ లేకపోవడంతో ఇంగ్లాండ్‌కు నాయకత్వం వహిస్తున్న బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్ మొదలు కావడంతో అంతర్జాతీయ ఆటగాళ్లు అందరు ఆనందిస్తున్నారు. ఈ మేరకు తమ సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ పై భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. నేను మ్యాచ్ ను ఆనందంగా చూస్తానని చెప్పారు. అలాగే భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ''చివరకు క్రికెట్ ఆడటం చాలా బాగుంది. ఇరు జట్లకు శుభాకాంక్షలు'' అని రోహిత్ అన్నాడు. అంతే కాకుండా ఈ మ్యాచ్ పై అశ్విన్, రికి పాంటింగ్ పాంటింగ్ ఇలా చాలా మంది ఆటగాళ్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.