ఈ ఫీలింగ్ ఎంతో ప్రత్యేకం: రోహిత్

ఈ ఫీలింగ్ ఎంతో ప్రత్యేకం: రోహిత్

భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే తండ్రయ్యాడు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. రోహిత్ సతీమణి రితికా సాజెద్ ఆడపిల్లకి జన్మనిచ్చింది. రోహిత్ ఆస్ట్రేలియా పర్యటన నుండి భారత్‌కు వచ్చి మళ్లీ తిరిగి వెళ్ళిపోయాడు. అప్పుడు సమయం తక్కువగా ఉండడంతో కూతురుతో గడిపే సమయం రోహిత్ కి రాలేదు. ఆస్ట్రేలియా పర్యటన అనంతరం న్యూజిలాండ్ పర్యటనను ముగించుకొని టీంఇండియా భారత్‌కు తిరిగొచ్చింది.

ఈ నెల 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఉన్న నేపథ్యంలో.. అప్పటి వరకు రోహిత్ కు కాళీ సమయం దొరికింది. దీంతో రోహిత్ తన కూతురితో సరదాగా సమయం గడుపుతున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని రోహిత్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. 'ఈ ఫీలింగ్ ఎంతో ప్రత్యేకం.. తిరిగి రావడం చాలా బాగుంది' అని ట్వీట్ చేసాడు. అంతేకాదు కూతురు తనపై పడుకున్న ఫోటోని షేర్ చేసాడు.