నా ఫిట్నెస్ ఏంటో చూపిస్తా అంటున్న రోహిత్… 

నా ఫిట్నెస్ ఏంటో చూపిస్తా అంటున్న రోహిత్… 

భారత జట్టు కరోనా లాక్ డౌన్ తర్వాత ఆడబోతున్న మొదటి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ను మొదట ఎంపిక చేయలేదు. ఐపీఎల్ లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడ్డ రోహిత్ తర్వాత నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అలాగే ఐపీఎల్ లో చివరి మూడు మ్యాచ్ లు ఆడి తాను ఫిట్ గా ఉన్నాను అని తెలిపాడు. అప్పుడు మళ్ళీ జట్లలో మార్పులు చేస్తూ రోహిత్ ను టెస్ట్ జట్లలోకి తీసుకున్నారు. అయితే తాజాగా తన గాయం పై రోహిత్ మాట్లాడుతూ...తనకు అయిన గాయం చిన్నదేనని... మళ్ళీ ఎటువంటి విమర్శలకు అవకాశం ఇవ్వకూడదనే ఎన్సీఏ లో శిక్షణ తీసుకుంటానని తెలిపాడు. అలాగే ఆస్ట్రేలియాలో వచ్చే నెల 17న ప్రారంభం కానున్న టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. అయితే ఈ సిరీస్ లో భారత కెప్టెన్ కోహ్లీ కేవలం మొదటి మ్యాచ్ మాత్రమే ఆడుతాడు అనే విషయం తెలిసిందే.