వరల్డ్‌కప్ 'గోల్డెన్ బ్యాట్' మనోడికే..
భారీ అంచనాల మధ్య ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన టీమిండియా సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. కప్ ఖాయమనున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. కనీసం ఫైనల్స్‌కి కూడా చేరుకోకపోవడం అటు అభిమానులతోపాటు ఆటగాళ్లనూ బాధించింది. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ ఆనందించేలా ఓ అవార్డు మన ప్లేయర్‌కి లభించింది. ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కిన రోహిత్ శర్మకు 'గోల్డెన్ బ్యాట్' లభించింది. మొత్తం 9 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 5 సెంచరీలతో 648 పరుగులు చేసి అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ కంటే ముందు సచిన్ (1996, 2003), రాహుల్ ద్రావిడ్ (1999) టీమిండియా తరఫున ఈ ఘనత సాధించారు. కీలక సమయాల్లో విలువైన పరుగులు చేసిన విలియమ్సన్‌కే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించగా.. సూపర్ ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్ స్టోక్స్‌కు ఫైనల్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)