కూతురు ఫోటోను షేర్ చేసిన రోహిత్ శర్మ

కూతురు ఫోటోను షేర్ చేసిన రోహిత్ శర్మ

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తన కూతురిని నెటిజన్లకు పరిచయం చేశాడు. హలో వరల్డ్ అంటూ తన కూతురు తన భార్య వేలు పట్టుకున్న ఫొటోను ట్విటర్‌లో రోహిత్ పోస్ట్ చేశాడు. షేర్ చేయగానే సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారిపోయింది. తొలి రెండు గంటల్లోనే వేల కొద్దీ లైక్స్, కామెంట్స్ వచ్చాయి. రోహిత్ భార్య రితికా సజ్దె గతవారం కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కూతురిని చూసేందుకే రోహిత్ భారత్ వచ్చిన రోహిత్ తిరిగి ఈనెల 8న ఆస్ట్రేలియా బయలుదేరనున్నాడు.