అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఎన్డీ తివారీ కుమారుడు

అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఎన్డీ తివారీ కుమారుడు

ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ సందిగ్ధ పరిస్థితుల్లో మరణించారు. మరణానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. సాయంత్రం 5.50 గంటలకు సాకేత్ మ్యాక్స్ డాక్టర్లు ఆయన మరణించినట్టు ప్రకటించారు. ఎన్డీ తివారీ కుమారుడైన రోహిత్ శేఖర్ ను మరణించాక తీసుకొచ్చినట్టు సాకేత్ లోని మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్లు ప్రకటించారని సౌత్ ఢిల్లీ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. అయితే రోహిత్ మృతికి గుండెపోటు కారణమై ఉండొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

రోహిత్ తివారీ ఎన్డీ తివారీ కుమారుడిగా గుర్తింపు పొందేందుకు సుదీర్ఘ కాలం న్యాయపోరాటం చేశారు. ఈ పోరాట ఫలితంగా చివరకు ఎన్డీ తివారీ రోహిత్ ను తన కుమారుడేనని అంగీకరించాల్సి వచ్చింది.