మాల్దీవ్స్‌లో రోహిత్‌ శర్మ రిలాక్స్‌

మాల్దీవ్స్‌లో రోహిత్‌ శర్మ రిలాక్స్‌

ప్రొఫెషనల్‌ క్రికెటర్లంటే బిజీబిజీ షెడ్యూల్. టోర్నీ తర్వాత టోర్నీ.. రోజు విడిచి రోజు మ్యాచ్‌. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌తోపాటు మానసికంగానూ సిద్ధంగా ఉంటేనే స్థాయికి తగ్గట్టు రాణించగలం. అందుకేనేమో.. ఏమాత్రం గ్యాప్‌ దొరికినా హాలీడేకు చెక్కేస్తారు మన క్రికెటర్లు. మొన్నటి వరకూ ఐపీఎల్‌లో బిజీగా గడిపిన రోహిత్‌ శర్మ.. ప్రపంచకప్‌ కోసం ఈనెల 22న ఇంగ్లాండ్‌ ఫ్లైట్‌ ఎక్కబోతున్నాడు. ఈ మధ్యలో దొరికిన కాస్త సమయంలో ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి సేద తీరుతున్నాడు. తన భార్య రితికా సజ్దే, కూతురు సమైరాతోపాటు కుటుంబసభ్యులతో కలిసి మాల్దీవుల్లో రిలాక్సవుతున్నాడు రోహిత్. ఆ టూర్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.