బెంగళూరుపై ముంబై ఘనవిజయం

బెంగళూరుపై ముంబై ఘనవిజయం
ఐపీఎల్‌-11 సీజన్ లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. బెంగళూరుపై 46 పరుగుల తేడాతో గెలిచి ముంబై తొలి విజయాన్ని అందుకుంది. 214 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ కోహ్లీ(62 బంతుల్లో 92 నాటౌట్, 7ఫోర్లు, 4సిక్స్‌లు) మినహా మిగితా బ్యాట్స్ మెన్స్ విఫలమయ్యారు. కృనాల్ పాండ్యా(3/28), మెక్‌క్లీగన్(2/24), బుమ్రా(2/28)లు చెలరేగడంతో బెంగుళూరు జట్టు వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ప్రధాన బ్యాట్స్ మెన్స్ డివిలీయర్స్(1), అండర్సన్(0), మణ్‌దీప్‌సింగ్(16), సుందర్(7)లు తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. కోహ్లీ ఒంటరి పోరాటం చేసినా.. ముంబై ఓటమిని తప్పించుకోలేకపోయింది. అంతకుముందు టాస్ ఒడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 213 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై జట్టు పరుగుల ఖాతా తెరువకముందే సూర్యకుమార్(0), ఇషాన్‌కిషన్(0) వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లెవిస్(42 బంతుల్లో 65, 6ఫోర్లు, 5సిక్స్‌లు), రోహిత్(52 బంతుల్లో 94, 10ఫోర్లు, 5సిక్స్‌లు)లు వీరవీహారం చేయడంతో రెండు వందల మార్క్ స్కోర్ సాధించింది. రోహిత్‌కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.