ఈ వరల్డ్‌కప్‌లో ఐదో సెంచరీ చేసిన రోహిత్‌

ఈ వరల్డ్‌కప్‌లో ఐదో సెంచరీ చేసిన రోహిత్‌

వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా దూసుకెళ్తోంది. 265 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగింది టీమిండియా. ఆది నుంచే ఓపెనర్లు రోహిత్‌శర్మ, కేఎల్‌రాహుల్‌లు తమదైన శైలిలో ఆడుతున్నారు. ఇద్దరూ సొగసైన బౌండరీలతో అలరించారు. అద్భుత ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ మరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్‌కు ఇది ఐదో సెంచరీ. కేఎల్ రాహుల్ కూడా అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం 29 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా  183 పరుగులు చేసింది. రోహిత్ 102, రాహుల్ 76 పరుగులతో క్రీజులో ఉన్నారు.