రోహిత్‌శర్మకు జరిమానా.. ఎందుకో తెలుసా?

రోహిత్‌శర్మకు జరిమానా.. ఎందుకో తెలుసా?

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మపై జరిమానా పడింది. నిన్న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్లను తన బ్యాటుతో కొట్టినందుకుగానూ  మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు రెఫరీ. ఎల్బీడబ్ల్యూగా అంపైర్‌ ప్రకటించిన అనంతరం పెవిలియన్‌కి వెళ్తూ రోహిత్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని బెయిల్స్‌ను  తన బ్యాట్‌తో పడగొట్టాడు. వారం రోజుల క్రితం చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా తన దురుసు ప్రవర్తనకు మూల్యం చెల్లించుకున్నాడు.