టీమిండియాను రోహిత్‌ గెలిపిస్తాడా..?

టీమిండియాను రోహిత్‌ గెలిపిస్తాడా..?

సిడ్నిలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ సెంచరీ చేశాడు. 40వ ఓవర్ ఐదో బంతికి రెండు పరుగులు చేసి కెరీర్‌లో 22వ శతకాన్ని నమోదు చేశాడు. రోహిత్‌ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 6 సిక్సర్‌లు ఉన్నాయి.  4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను ధోనీ-రోహిత్‌ ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 137 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 51 పరుగులు చేసి ధోనీ అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్(128), భువనేశ్వర్‌ కుమార్‌(0) ఉన్నారు. భారత స్కోరు 45 ఓవర్లకు 214/6. భారత్‌ విజయానికి ఇంకా 30 బంతుల్లో 75 పరుగులు కావాలి.