అందుకే నాకు ఛాన్స్‌ రాలేదేమో: రోజా 

అందుకే నాకు ఛాన్స్‌ రాలేదేమో: రోజా 

కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని వైసీపీ ఎమ్మెల్యే రోజా అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ కూర్పు అనంతరం తొలిసారిగా ఇవాళ ఆమె విజయవాడ వచ్చారు. ఈ సందర్భంగా 'ఎన్టీవీ'తో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదన్న రోజా.. తాను అలిగానన్నది మీడియా ప్రచారం మాత్రమేనని అన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా..  ఎమ్మెల్యేలు ఎందుకు? అందుకే నేను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు' అని చెప్పారు. తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని.. అది కూడా మీడియా సృష్టేనని ఆమె తెలిపారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానన్న రోజా.. మంత్రి పదవులు లభించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.