ఎట్టకేలకు రోజాకు కీలక పదవి

ఎట్టకేలకు రోజాకు కీలక పదవి

వైసీపీ ముఖ్యనేత, నగరి ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభించింది. ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్‌పర్సన్‌గా రోజాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 
ఏపీ మంత్రివర్గంలో తనకు కచ్చితంగా చోటు దక్కుతుందని భావించిన రోజా... కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారని వార్తలొచ్చాయి. ఈక్రమంలో ఆమెను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించడంతో సముచిత స్థానం కల్పించినట్టయింది. 
ఇక.. కాపు కార్పొరేషన్‌కు ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గా కరికాల వలవన్‌ను,  ఇన్‌చార్జి ఎండీ నాగభూషణంను నియమించింది. ప్రస్తుతం ఎంబీసీ కార్పొరేషన్ ఎండీగా ఉన్న నాగభూషణంకి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.