కన్నీళ్లు పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ రోజా

కన్నీళ్లు పెట్టుకున్న ఫైర్ బ్రాండ్ రోజా

తెలుగు రాజకీయాల్లో నగరి ఎమ్మెల్యే ఆర్కో రోజా అంటే ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. అలాంటి త్గాబబి అధికారులు,సోంత పార్టీ నేతలు తనను పట్టించుకోలేదని,కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ తిరుపతిలో జరిగిన అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. పనిలో పనిగా జిల్లా నేతలపై..అధికారులపై కమీటికి ఫిర్యాదు చేశారు. ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన రోజా సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటోంది. రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకనో రోజా అంత సంతోషంగా లేరు. విపక్షంలో ఉన్న ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డానని తనకు మంత్రి పదవి ఖాయమని ఆమె భావించారు.

అయితే అనేక సమీకరణాల నేపధ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఆమెకు చోటు దక్కలేదు. తీవ్రస్థాయిలో అలకబూనడంతో సీఎం జగన్ ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ గిరి కట్టబెట్టారు. అయినా కూడా రోజాలో ఏదో తెలియని వెలితి. జిల్లాలో రాజకీయంగా తనను అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారని, తనను ఒంటరి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న భావన ఆమెలో ఎప్పటి నుండో నాటుకుపోయింది...అది రోజురోజుకు పెరుగుతుందనే మాటలు వినపడుతూన్నాయి... మొదట మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పేచీ,తరువాత డిప్యూటీ సిఎం నారాయణ స్వామీతో గోడవలు..వీటి అన్నిటికీ అధిష్ఠానం సర్దుబాటు చేసిందని అనుకున్న సమయంలో మరోసారి తన బాధను కన్నీటితో శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందు చెప్పుకోచ్చారు... ప్రొటోకాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట బోరున విలపించారు.

సొంత నియోజకవర్గంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినా... రోజాకు సమాచారం అందించలేదు. దీంతో ఆమె నొచ్చుకుని.. ప్రివిలైజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో ఇలా పలుసార్లు జరిగిందని కమిటీ ముందు తన ఆవేదన వెలిబుచ్చారు.  సొంత పార్టీ అధికారంలో ఉండగా... తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులపై ఫిర్యాదు చేశారు. కలెక్టర్ సహా ఎవరూ తనను పట్టించుకోవడం లేదని నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. 

ఐతే తన విషయంలో జరగుతున్న పరిణామాలపై చాన్నాళ్లుగా ఎమ్మెల్యే రోజా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు తెలియకుండానే పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మంత్రులు తన నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం., వాటిపై కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మొన్నామధ్య ఇదే విషయంలో రోజాకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో  వివాదం సద్దుమణిగింది. ఐతే ఇటీవల నగరి నియోజకవర్గ పరిధిలో టీటీడీకి చెందిన 6వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినా తనను పిలవకపోవడంపై రోజా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.

అ సమావేశానికి నియోజక వర్గానికి సంబంధం లేని ఎమ్మెల్యే భూమనకరుణాకర్ రెడ్డి,చెవిరెడ్డిని పిలిచారని.... మంత్రి పెద్దిరెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారని.. ఎమ్మెల్యేగానే కాకుంగా ఏపీఐఐసీ చైర్మన్ కూడా ప్రాధాన్యం ఇవ్వకుంటే ఇంకెవరికి ఇస్తారని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతుంది... ఇంటి స్దలాలు ఎపీఐఐసీ సంబంధించి భూములు అని తెలిసిన అధికారుల, సోంత పార్టిక నేతలు ఏమాత్రం పట్టించుకోలేదన్నది అమె కన్నీటికి కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సిఎంనారాయణ స్వామీపై తన నియోజక వర్గంలో అనాధికార ఎమ్మెల్యేగా ఉన్నారని కమీటి వద్ద చెప్పినట్లు టాక్.

అయితే ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రోజా ఫిర్యాదుపై కమిటీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రోటోకాల్ విషయంలో ఇబ్బందులు ఉన్నాయని రోజా ఫిర్యాదు చేశారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని విషయాలకు జిల్లా కలెక్టర్‌కు చెప్పామని అవన్నీ సరిచేసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో కూడా అభివృద్ధి పనులకు,కోన్ని సమస్యలను  కమిటీకి వివరించారని.. అవి తమ పరిధిలో లేకపోయినా వాటిని సిఎం జగన్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు కాకాణి.