మరోసారి బాలయ్య సినిమాలో రోజా... !! 

మరోసారి బాలయ్య సినిమాలో రోజా... !! 

బాలకృష్ణ - రోజా కాంబినేషన్లో గతంలో చాలా సినిమాలు వచ్చాయి.  వచ్చిన సినిమాల్లో 90శాతానికి పైగా విజయం సాధించాయి.  అయితే, మరలా ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారా అంటే ఫిలిం నగర్ వర్గాలు అవుననే అంటున్నారు. రోజా సినిమాల నుంచి బయటకు వచ్చిన తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యింది.  వైకాపాలో ఎమ్మెల్యేగా ఉన్నది.  2014 నుంచి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆమె సినిమాలను దూరంగా పెట్టింది.  

ప్రస్తుతం నగరి ఎమ్మెల్యేగా ఉంటూ.. మరోవైపు ఏపీఐఐసి కార్పొరేషన్ చైర్మన్ గా పదవిని నిర్వహిస్తూ బిజీ అయ్యింది.  2013 నుంచి రోజా బుల్లితెర ఓ కార్యక్రమానికి మాత్రమే జడ్జిగా వ్యవహరిస్తోంది.  వెండితెరపై మాత్రం అడుగుపెట్టలేదు.  అయితే, బోయపాటి - బాలయ్య కాంబినేషన్లో 106 వ సినిమా రెడీ అవుతున్నది.  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా చేస్తున్నారు.  సంజయ్ దత్ తో పాటుగా ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర కూడా ఈ సినిమాలో ఉన్నట్టుగా తెలుస్తోంది.  ఆ పాత్ర కోసం రోజాను అడిగారట బోయపాటి.  అయితే రోజా అలోచించి చెప్తానని చెప్పినట్టుగా సమాచారం.  రాజకీయా విద్వేషాలను పక్కన పెట్టి రోజా ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటే మరో సంచలనమే అని చెప్పాలి.