చరణ్.. అలియాల మధ్య రొమాంటిక్ సాంగ్.. నిజమేనా? 

చరణ్.. అలియాల మధ్య రొమాంటిక్ సాంగ్.. నిజమేనా? 

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  సాంగ్స్ మినహా దాదాపుగా 70% షూటింగ్ పూర్తయినట్టు ఇప్పటికే యూనిట్ ప్రకటించింది.  యూనిట్ చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం అల్యూనిమియం ఫ్యాక్టరీలో షూటింగ్ చేస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో ఇప్పటికే 7 సాంగ్స్ ఉన్నాయని తెలుస్తోంది.  దేశభక్తికి సంబంధించిన సాంగ్స్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.  

ఇదిలా ఉంటె, ఇందులో చరణ్ కు జోడిగా అలియా భట్ నటిస్తోంది.  అలియా.. చరణ్ లు భార్యాభర్తలుగా నటిస్తున్నారు.  వీరిద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారట.  దీనికి సంబంధించి డ్యాన్స్ ను ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది.  ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది జులై 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.