ఆ సాంగ్ లో పాత చిరును చూస్తారు..

ఆ సాంగ్ లో పాత చిరును చూస్తారు..

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా.  షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  గతంలో కోకాపేటలో వేసిన సెట్ అగ్నిప్రమాదానికి గురి కావడంతో షూటింగ్ ఆలస్యం అయింది.  ఇదిలా ఉంటె ప్రస్తుతం సైరాలో ఓ సాంగ్ ను అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరించబోతున్నారు.  

తాజా సమాచారం ప్రకారం, సెట్ లో షూట్ చేయబోతున్న సాంగ్ రొమాంటిక్ గా ఉండబోతుందని తెలుస్తోంది.  నయనతార, మెగాస్టార్ లపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు.  శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ అందిస్తున్నారు.  ఈ సాంగ్ షూట్ తరువాత తిరిగి కోకాపేట సెట్ లో మిగిలిన షూటింగ్ పూర్తి చేస్తారట.