శాంపిల్ అదిరింది... ముద్దుల పండుగే మిగిలింది..!!

శాంపిల్ అదిరింది...  ముద్దుల పండుగే మిగిలింది..!!

తెలుగులో అర్జున్ రెడ్డి ఎలాంటి హిట్ అయిందో చెప్పక్కర్లేదు.  ఈ సినిమా విజయం తరువాత విజయ్ దేవరకొండకు విపరీతంగా క్రేజ్ వచ్చింది.  ఇప్పుడు ఈ సినిమాను తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు.  తమిళంలో విక్రమ్ కుమారుడు ధ్రువ హీరో.  బాల దర్శకుడు.  ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు.  తెలుగు సినిమాకు దగ్గర పోలికలు ఉన్నాయి.  

హిందీ విషయానికి వస్తే, షాహిద్ కపూర్ హీరో కాగా, భరత్ అనే నేను హీరోయిన్ కియారా అడ్వాణీ హీరోయిన్.   కియారకు లస్ట్ స్టోరీస్ లో నటించిన అనుభవం ఉంది.  ముద్దు సీన్స్ ను బాగా హ్యాండిల్ చేయగలదు.  ఇటీవల షాహిద్, కియారాలు కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు.  రెహ్మాన్ సాంగ్ ఊర్వశి సాంగ్ కు డ్యాన్స్ చేశారు.  ఆ సమయంలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్టుగా ఉంది.  ఓ శాంపిల్ ఇచ్చారు.  శాంపిల్ అంత  రొమాంటిక్ ఉంటె.. అసలు సినిమా  ఇంకెలా ఉంటుందో.