రన్నింగ్‌ బస్సు టాప్‌ లేచిపోయింది..!

రన్నింగ్‌ బస్సు టాప్‌ లేచిపోయింది..!

తమిళనాడులో ఓ బస్సు టాప్‌ లేచిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. ఇంతకీ జరిగిందేంటంటే.. తమిళనాడులో పోలాచ్చి నుంచి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు గమ్యస్థానానికి బయలుదేరింది. దాదాపు 35 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అని కంగారు పడిన  డ్రైవర్‌ ఒక్కసారిగా బస్సును రోడ్డు పక్కనే ఆసేసి కిందకు దిగి చూశాడు. బస్సు టాప్‌.. రేకులా ఏకంగా ఊడిపడడంతో ఆశ్చర్యపోయాడు. పెద్ద ప్రమాదమే తప్పిందనుకుని ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.