దిల్ రాజు మేనల్లుడి "రౌడీ బాయ్స్" మోషన్ పోస్టర్

దిల్ రాజు మేనల్లుడి "రౌడీ బాయ్స్" మోషన్ పోస్టర్

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ "రౌడీ బాయ్స్"తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో ఆశిష్ సరసన మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో 'హుషారు' వంటి యూత్ ఫుల్ చిత్రాన్ని రూపొందించిన శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తుండగా... 'రౌడీ బాయ్స్'కు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 25న 'రౌడీ బాయ్స్' థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ మోషన్ పోస్టర్ లోనే లవ్, ఫైట్, డ్రామా, గ్యాంగ్ వార్ లాంటివి చూపిస్తూ సినిమాపై ఆసక్తిని అమాంతం పెంచేశారు. మీరు కూడా 'రౌడీ బాయ్స్' మోషన్ పోస్టర్ ను వీక్షించండి.