విజయవాడలో రౌడీషీటర్‌ దారుణ హత్య 

విజయవాడలో రౌడీషీటర్‌ దారుణ హత్య 

విజయవాడలో రౌడీషీటర్‌ కిలారి సురేష్ దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని సీవీఆర్ ఫ్లైఓవర్‌పై నిన్న అర్ధరాత్రి ఆయనపై కత్తులతో దాడిచేసి హతమార్చారు. వాగు సెంటర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌తో వివాదమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. కిలారి సురేష్‌పై పలు పోలీస్ స్టేషన్లలో గంజాయి, కొట్లాట కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.