ఐపీఎల్ 2021 : బెంగళూరు టార్గెట్ ఎంతంటే...?

ఐపీఎల్ 2021 : బెంగళూరు టార్గెట్ ఎంతంటే...?

ప్రస్తుతం ఐపీఎల్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ మొదట తడబడింది. కేవలం 18 పరుగులకే కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్ సంజు సామ్సన్ (21) పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత శివం దుబే(46) రాణించగా అతనికి రియాన్ పరాగ్ (25) తోడుగా నిలిచాడు. కానీ వీరిద్దరూ పెవిలియన్ కు చేరుకున్న తర్వాత చివర్లో రాహుల్ తెవాటియా(40) తో అదరగొట్టడంతో రాజస్థాన్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇక బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా కైల్ జామిసన్, కేన్ రిచర్డ్సన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.. అయితే ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోహ్లీ సేన 178 పరుగులు చేయాలి. ప్రస్తుతం ఆ జట్టులో గ్లెన్ మాక్స్వెల్, ఎబి డివిలియర్స్ మంచి ఫామ్ లో ఉన్న విషయం తెలిసిందే. చూడాలి మరి వాళ్ళు ఈ  మ్యాచ్ లో ఏం చేస్తారు అనేది.