17పరుగుల తేడాతో బెంగళూరు విజయం

17పరుగుల తేడాతో బెంగళూరు విజయం

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడో విజయం సొంతం చేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 17 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ (44 బంతుల్లో 82 నాటౌట్‌; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), స్టొయినిస్‌ (34 బంతుల్లో 46 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులు చేసి ఓడింది. పూరన్‌ (28 బంతుల్లో 46; 1 ఫోర్, 5 సిక్స్‌లు), రాహుల్‌ (27 బంతుల్లో 42; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఉమేశ్‌ 3, సైనీ 2 వికెట్లు తీశారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.