టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

కాసేపట్లో బెంగళూరు చినరామస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న బెంగళూరు జట్టు ప్లేఆఫ్ అర్హత కొల్పోయింది. ఇది ఆ జట్టుకు కేవలం నామమాత్రపు మ్యాచ్. రాజస్థాన్ జట్టు మాత్రం ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ చేరాలని పట్టుదలతో ఉంది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. యాష్‌టన్ టర్నర్ స్థానంలో మహిపాల్ లొమ్‌రొర్‌ని జట్టులోకి తీసుకుంది. ఇక బెంగళూరు జట్టులో రెండు మార్పులు చేసింది. పవన్ నెగి, కుల్వంత్‌లను జట్టులోకి తీసుకుంది.