బెంగళూరు టార్గెట్ః 176

బెంగళూరు టార్గెట్ః 176

చినసామి స్టేడియంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌(70; 43 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్స్‌లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా(20; 11 బంతుల్లో 4ఫోర్లు), మార్టిన్‌ గప్తిల్‌(30; 23 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్స్‌లు) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సాహా, గప్తిల్‌, మనీశ్‌పాండే(9) త్వరగానే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన విలియమ్సన్‌, విజయ్‌శంకర్‌(27; 18 బంతుల్లో 3సిక్స్‌లు) చక్కగా రాణించారు. ఆఖరి ఓవర్‌లో విలియమ్సన్‌ ధాటిగా ఆడి బౌండరీలతో చెలరేగడంతో బెంగళూరుకు భారీ టార్గెట్ ను నిర్దేశించాడు. బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ మూడు, నవ్‌దీప్‌ సైనీ రెండు వికెట్లు తీయగా చాహల్‌, కుల్వంత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.