ఐపీఎల్ 2021 : మరోసారి విఫలమైన సన్‌రైజర్స్ 

ఐపీఎల్ 2021 : మరోసారి విఫలమైన సన్‌రైజర్స్ 

చెన్నై వేదికగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన హైదరాబాద్ జట్టుకు బెంగళూరు బౌలర్లు మొదట్లోనే షాక్ ఇచ్చారు. ఓపెనర్ సాహను ఒక్క పరుగుకే వెనక్కి పంపారు. కానీ ఆ తర్వాత కెప్టెన్ వార్నర్ మనీష్ పాండే తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. కానీ అర్ధశతకం పూర్తి చేసిన తర్వాత వార్నర్ ఔట్ అయిన తర్వాత హైదరాబాద్ డీలా పడిపోయింది. మనీష్ స్లో బ్యాటింగ్ అలాగే తర్వాత వచ్చిన ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ కు చేరడంతో 150 పరుగుల లక్ధ్యాని చేధించడంతో సన్‌రైజర్స్ విఫలమైంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 143 పరుగులు చేయడంతో కోహ్లీ సేన 6 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59) తో  అలాగే ఆ జట్టు కెప్టెన్ కోహ్లీ(33)తో రాణించడంతో ఆ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన విషయం తెలిసిందే.