ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బౌలింగ్ చేయనున్న చెన్నై...

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బౌలింగ్ చేయనున్న చెన్నై...

ఐపీఎల్ 2020 లో ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో వరుస పరాజయాలతో ఉన్న చెన్నై ముందుగా బౌలింగ్ చేయనుంది. ఇప్పటివరకు ఈ ఏడాది ఐపీఎల్ లో కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించిన చెన్నై మిగిలిన మూడు మ్యాచ్ లలో విజయం సాధించాలని చూస్తుంటే... ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకున్న మొదటి జట్టుగా నిలవాలని బెంగళూరు చూస్తుంది. మరి చూడాలి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది.

చెన్నై : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, అంబటి రాయుడు, ఎన్ జగదీసన్, ఎంఎస్ ధోని (w/c), సామ్ కర్రన్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ఇమ్రాన్ తాహిర్, మోను కుమార్

బెంగళూరు : దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్ (w), మొయిన్ అలీ, గుర్కీరత్ సింగ్ మన్, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్