బుల్లెట్‌ ధర పెంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఎంతంటే..?

బుల్లెట్‌ ధర పెంచిన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌.. ఎంతంటే..?

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. యువత నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అంతా ఆ బైక్ అంటే ఆసక్తి చూపనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు.. అయితే, బుల్లెట్‌ ప్రేమికులకు షాకిచ్చే వార్త చెప్పింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ (ఆర్‌ఈ).. ఇప్పటికే పలుమార్లు ధరలు పెరుగుతూ రాగా.. కరోనా నేపథ్యంలో బుల్లెట్‌ 350 బీఎస్‌6 మోడల్స్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.. భారత్‌లో బుల్లెట్‌ 350 మూడు వేరియంట్లలో లభిస్తుండగా.. ఆ మూడింటి ధరలను పెంచింది. బుల్లెట్‌ ఎక్స్‌, స్టాండర్డ్‌ బ్లాక్‌, టాప్‌ఎండ్‌  ఈఎస్ వేరియంట్లలో బుల్లెట్‌ 350 సీసీ బైక్ అందుబాటులో ఉంది.. అయితే, వాటి ఎక్స్‌ షోరూం ధరపై 2 శాతం వరకు పెంచుతున్నట్లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రకటించింది. 2 శాతంగా తీసుకున్నా.. ఒక్కో బుల్లెట్ ధర రూ.2,756 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350 మోడల్స్‌ కొత్త ధరలను ఓ సారి పరిశీలిస్తే.. ఢిల్లీలో ఎక్స్‌ షోరూం ధరలు.. బుల్లెట్‌ ఎక్స్‌ 350 ధర రూ.1,27,093గా, బుల్లెట్ 350 (బ్లాక్‌) ధర రూ.1,33,260గా.. బుల్లెట్‌ ఎక్స్‌ 350 ఈఎస్‌ ధర రూ. 1,42,705గా ఉండనుంది. ఇక, ఆయా ప్రాంతాలను బట్టి.. ఈ ధర కాస్త అటూఇటుగా మారనుంది.