ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట బోటు.. మృతదేహాలు వెలికితీత..!

ఒడ్డుకు చేరిన రాయల్ వశిష్ట బోటు.. మృతదేహాలు వెలికితీత..!

ఎట్టకేలకు గోదావరి నదిలో ముగినిపోయిన బోటును వెలికితీశారు.. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు దగ్గర మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును ఒడ్డుకు చేర్చింది ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన మరో టీమ్. దీంతో 38 రోజుల పాటు గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బయటకు వచ్చింది. సెప్టెంబర్ 15వ తేదీన కచ్చలూరు దగ్గర గోదావరిలో ఈ బోటు మునిగిపోయింది.. ఈ ప్రమాదంలో 26 మంది ప్రాణాలతో బయటపడగా.. 39 మంది మృతిచెందారు. ఇంకా 12 మంది ఆచూకీ లభించాల్సి ఉండగా.. ప్రస్తుతంలో పూర్తిగా ధ్వంసమైన రాయల్ వశిష్ట బోటు శిథిలాల్లో పలు మృతదేహాలు చిక్కుకున్నాయి. బోటు నుంచి ఐదు మృతదేహాలను బయటకు తీశారు. అయితే, మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితితో ఉండడంతో.. గుర్తించడం కష్టంగా మారింది.