ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ ప్రవేశపరీక్షలో గందరగోళం

ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్ ప్రవేశపరీక్షలో గందరగోళం

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవేశ పరీక్ష నిర్వహణలో గందరగోళం తలెత్తింది. హైదరాబాద్ దుండిగల్ ఏరోనాటికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పరీక్ష విధానంలో లాగిన్ సమస్యలు తలెత్తాయి. అభ్యర్థులు అధిక సంఖ్యలో హజరుకావడం, కేవలం 3 బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు పడ్డారు. ఓవైపు హాజరు నమోదు జరుగుతుండగానే సిబ్బంది అభ్యర్థులకు పరీక్ష పత్రం అందజేశారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ప్రవేశ పరీక్షను నిలిపివేశారు.