#RRR అప్డేట్ - వాళ్ళను అదే రోజు ప్రకటిస్తారేమో..!!

#RRR అప్డేట్ - వాళ్ళను అదే రోజు ప్రకటిస్తారేమో..!!

నవంబర్ 11 వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే.  ఈ న్యూస్ ను అఫీషియల్ గా ప్రకటించారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లను సరికొత్త లుక్ లో చూపించబోతున్నట్టుగా తెలుస్తున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తప్పించి ఇందులో నటించే హీరోయిన్లు ఎవరు అనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు.  

అందుతున్న సమాచారం ప్రకారం, ఇందులో నటించే హీరోయిన్లను పూజా కార్యక్రమం రోజునే ప్రకటించబోతున్నారని తెలుస్తున్నది.  ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు.  అందులో ఒకరు హాలీవుడ్ హీరోయిన్ కాగా, మరో ఇద్దరు ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.  ఈ సస్పెన్స్ కు నవంబర్ 11 తో తెరపడుతుందని తెలుస్తున్నది.