#RRR లాంచింగ్ డేట్ కన్ఫర్మ్..!!

#RRR లాంచింగ్ డేట్ కన్ఫర్మ్..!!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ముల్టీస్టారర్ సినిమా లాంచింగ్ డేట్ ను కొద్ది సేపటి క్రితమే అఫీషియల్ గా ప్రకటించారు.  నవంబర్ 11 వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేయబోతున్నారు.  డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమా ఇదే కావడం విశేషం.  

ఈ సినిమా కోసం ఇప్పటికే ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నారు.  రామ్ చరణ్ కూడా త్వరలోనే ఈ సినిమాలో జాయిన్ అవుతారు.  మొదటి పదిరోజుల షూటింగ్ ఈ ఇద్దరి స్టార్స్ పైనే ఉంటుందని సమాచారం.