అంత పెట్టేందుకు ఏముంది..?

అంత పెట్టేందుకు ఏముంది..?

రాజమౌళి సినిమాలు ఇప్పటి వరకు అన్నీ క్యూరియాసిటీని కల్గిస్తూ వచ్చినవే.  ఇప్పుడు వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకూడా ఇలాంటి క్యూరియాసిటీనే కల్గిస్తోంది.  ముఖ్యంగా బడ్జెట్.  సినిమాకు దానయ్య దాదాపుగా రూ.350 నుంచి 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.  ఇంతభారీ మొత్తంలో ఖర్చు చేయడానికి ఈ సినిమాలో ఏం చూపించబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.  

ఆంగ్లేయులపై పోరాటం చేసిన అల్లూరి సీతారామరాజు, నైజాంలో పోరాటం చేసిన కొమరం భీమ్ ల కథ.  ఇద్దరు వీరులు అడవుల నుంచి పోరాటం చేశారు.  దీనికి పెద్దగా ఖర్చు ఉండదు.  బాహుబలి స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోవని సమాచారం.  వీరి బాల్యం ఎలా ఉంది.. ఎలా వీరులుగా మారారు అనే కథాంశంతో తెరెక్కిస్తున్నారని తెలుస్తోంది.  రాజమౌళి ఫిక్షన్ సినిమా అంటున్నాడు కాబట్టి.. సినిమా భారీ స్థాయిలోనే ఉండొచ్చు.  అయినప్పటికీ అంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు అన్నది తెలియాలి.