ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్న రాజమౌళి 

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్న రాజమౌళి 

'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి కరోనా కారణంగా ఆటంకం ఏర్పడింది. ఐదు నెలలుగా చిత్రీకరణ పునఃప్రారంభించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ, సెట్స్‌ మీదకు వెళ్లలేదు. మధ్యలో నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకుడు రాజమౌళి కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు వాళ్లిద్దరూ కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. చిత్రీకరణ ప్రారంభించడానికి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సైతం సిద్ధంగా ఉండటంతో విజయదశమి తర్వాత సెట్స్‌ మీదకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో తెరకెక్కించే సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. బహుశా... ఈ నెలాఖరున లేదా ఆక్టోబర్‌ తొలి వారంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రీకరణ మళ్లీ మొదలవుతుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల కథనం...