ఆర్ఆర్ఆర్ ... రౌద్రం.. రణం.. రుధిరం... 

ఆర్ఆర్ఆర్ ... రౌద్రం.. రణం.. రుధిరం... 

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను యూనిట్ రిలీజ్ చేసింది.  ఈ సినిమా టైటిల్ ఏంటి అన్నది ఇప్పటి వరకు ఉన్న సస్పెన్స్ కు తెరపడింది.  ఆర్ఆర్ఆర్ అంటే రౌద్రం రణం రుధిరం అనే జెస్టిఫికేషన్ ఇచ్చారు.  టైటిల్ లోగోతో పాటుగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన లుక్స్ ను కూడా రిలీజ్ చేశారు.  

అయితే, అది మోషన్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేయడం విశేషం.  ఎన్టీఆర్ వాటర్ మ్యాన్ గా, రామ్ చరణ్ ఫైర్ మ్యాన్ గా చూపించారు. 1.12 నిమిషాలపాటు ఉన్న ఈ మోషన్ పోస్టర్ మొత్తం విజువల్ వండర్ గా తీర్చి దిద్దారు.  1920 కాలం నాటి కథ అని ఆ టైటిల్ లోగోలో చూపించారు.  ఎన్నో రోజులుగా ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఉగాది రోజున మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి కాస్త ఊరటను ఇచ్చారని చెప్పాలి.