మార్చి 14 న అన్ని విషయాలు చెప్తాడట..!!

మార్చి 14 న అన్ని విషయాలు చెప్తాడట..!!

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ ఎత్తున జరుగుతున్నది.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.  ఈ షెడ్యూల్ తరువాత నెల రోజులపాటు కోల్ కతాలో జరిగే షెడ్యూల్ కోసం యూనిట్ అక్కడి వెళ్లనుంది.  వెళ్లే ముందు రాజమౌళి మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి.  

అందుకు తగ్గట్టుగానే రాజమౌళి మార్చి 14 వ తేదీన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు.  ఆ రోజున ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను మీడియాతో పంచుకోబోతున్నారు.  చాలా కాలం నుంచి కలిగించిన క్యూరియాసిటీకి రేపటితో తెరపడబోతున్నది.  ఈ సమావేశంలో రాజమౌళి ఇవేం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.