"ఆర్‌ఆర్‌ఆర్‌" నుంచి అదిరిపోయే అప్టేట్‌ వచ్చేసింది

"ఆర్‌ఆర్‌ఆర్‌" నుంచి అదిరిపోయే అప్టేట్‌ వచ్చేసింది

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రామ్‌చరణ్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ కనిపించనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇవాళ ఈ సినిమా నుంచి లేటేస్ట్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో రాంచరణ్‌ గుర్రంపై, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బైక్‌పై ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను చూసి...ఇటు చరణ్‌, అటు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ నుంచి బిగ్గెస్ట్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే.