ఆ రెండు సీన్స్ కోసం రూ.40 కోట్లు..!!

ఆ రెండు సీన్స్ కోసం రూ.40 కోట్లు..!!

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం గ్యాప్ వచ్చింది.  ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ మూడ్ లో ఉండగా, రామ్ చరణ్ తన తండ్రి సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీ అయ్యారు.  మరో నాలుగైదు రోజుల్లో తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతుంది.  రాజమౌళి అమెరికా నుంచి వచ్చాక భారీ సీన్స్ ప్లాన్ చేస్తున్నారు.  

రెండు సీన్స్ ను భారీగా తీసేందుకు సిద్ధం అయ్యారు.  ఈ రెండు సీన్స్ కోసం ఏకంగా రూ. 40 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.  ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో శంకర్ తరువాత ఆ స్థాయిలో భారీగా సినిమాలు తీయగల సత్తా ఉన్న దర్శకుల్లో రాజమౌళి ఒకరు అనే సంగతి తెలిసిందే.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లపై ఈ రెండు సీన్స్ ను షూట్ చేస్తారట.  అయితే, ఇద్దరు కలిసి ఈ సీన్స్ చేస్తారా లేదంటే సన్నివేశాలు విడివిడిగా ఉంటాయా అన్నది తెలియాలి.