మెగాస్టార్ క్లాప్ తో మొదలైన ఆర్ఆర్ఆర్
ఆర్ఆర్ఆర్ సినిమా ఈరోజు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. టాలీవుడ్ కు చెందిన అతిరధ మహారధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మెగాస్టార్ తో పాటు, ప్రభాస్, రానా, రాఘవేంద్ర రావు తదితరులు హాజరయ్యారు. పూజా కార్యక్రమం అనంతరం రాఘవేంద్ర రావు స్క్రిప్ట్ ను ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళికి అందజేసి అక్షింతలు వేయగా, మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. మెగాస్టార్ క్లాప్ తో సినిమా ప్రారంభమైంది.
ఈరోజు నుంచే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్టుగా తెలుస్తున్నది. ఈ వేడుకకు మీడియాను, ఫ్యాన్స్ ను అనుమతించలేదు. కారణం ఏమిటీ అన్నదిమాత్రం తెలియడంలేదు. ఈ సినిమా ప్రొడ్యూసర్ డివివి దానయ్యకు చెందిన డివివి ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ ద్వారా ఫోటోలను షేర్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)