ఆసక్తి రేపుతున్న ఆర్ఆర్ఆర్ టైటిల్

ఆసక్తి రేపుతున్న ఆర్ఆర్ఆర్ టైటిల్

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ వర్కింగ్ టైటిల్ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నది.  రామ్ చరణ్, ఎన్టీఆర్ లు నటిస్తున్న ఈ సినిమా గురించిన ఎలాంటి చిన్న న్యూస్ బయటకు వచ్చినా... అది ఆసక్తికరంగా మారింది.  రామ్ చరణ్, ఎన్టీఆర్ ల గాయాల తరువాత ఇద్దరు తిరిగి షూటింగ్ పాల్గొనబోతున్నారు.  హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లోనే అలియా భట్ కూడా పాల్గొనబోతున్నది.  ఎన్టీఆర్ హీరోయిన్ కోసం యూనిట్ వెయిట్ చేస్తున్నది.  

ఇదిలా ఉంటె, ఆర్ఆర్ఆర్ టైటిల్ విషయంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.  ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ ను ప్రేక్షకులకు వదిలేశారు రాజమౌళి.  చాలామంది ఈ సినిమాకు రామ రావణ రాజ్యం, రఘుపతి రాఘవ రాజారామ్ అనే టైటిల్స్ ను సజెస్ట్ చేశారు.  అయితే, ఈ టైటిల్స్ లోనుంచి కొన్ని పదాలను సెలక్ట్ చేసుకొని టైటిల్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.  వచ్చే ఏడాది జులై 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.